sathamannambhavathi - nalo nenu telugu lyrics

శతమానంభవతి - నాలో నేను 
రచన: రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్; మికీ j మేయర్
గానం: సమీరా భరద్వాజ్
నాలో నేను నీలో నేను 
నువ్వంటే నేను రా 
నాతో నేను నీతో నేను 
నువ్వంటే నేనురా ... 
ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను 
ఎంత ఎంత ముద్దొస్తున్నావో 
ఎంత ఎంత అల్లేస్తున్నావో 
నువ్విలా నాలో నుంచి నన్నే మొత్తంగా తీసేసావో 
చల్లగాలి చక్కిలిగింతల్లో నువ్వే.. 
చందమామ వెన్నెలకాంతుల్లో నువ్వే నువ్వే... 

రంగు రంగు కుంచెల గీతల్లో నువ్వే.. 
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే... 

అటు ఇటు ఎక్కడో...  నువ్వెటు నిలచిన 
మనసుకు పక్కనే నిన్నిలా చూడనా.. 
నీవే ధ్యాసలో నను నే మరచిన... 
సంతోషంగా సర్లే అనుకోనా .. ఎన్నాళ్లయినా 
హో హో 
కలలకిన్ని రంగులు పూసింది నువ్వే.. 
వయసుకిన్ని మెలికలు నేర్పింది నువే నువ్వే ... 
నిన్నలేని సందడి తెచ్చింది నువ్వే.. 
నన్ను నాకు కొత్తగా చూపింది నువ్వే నువ్వే... 
మనసుకు నీకలా అలవాటై ఇలా 
వదలదే ఓ క్షణం ఊపిరే తీయగా 
నా నలువైపులా తీయని పిలుపుల్లా .. 
మైమరిపించే తియ్యని సంగీతం నీ నవ్వేగా... 


other songs from sathamaanambhavathi album


sathamaanambhavathi title song

mellaga thellarindoila

nilavade

Comments