Manidweepa varnana- Bhakti geethalu

Manidweepa varnana



1. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూలప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉన్నది
2. సుగంధ పుష్పాలేన్నోవేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు
3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు
4. పారిజాతవన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు
5. భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యము
6. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున కలవు
మధుర మధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు
7. అరువదినాలుగు కళామతల్లులు వరాల నొసగే పదారుసక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు
8. అష్టసిద్ధులు నవ నవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు
9. కోటిసూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లనివెలుగులు
కోటితారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు
10. కంచుగోడలప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఎడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు
11. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు
12. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైధుర్యాలు
పుష్యరాగమణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు
13. సప్తకోటిఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు
14. భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యము
15. మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతామణులు మణిద్వీపానికి మహానిధులు
16. కుబేరఇంద్రవరుణదేవులు శుభాల నొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు
17. కస్తూరిమల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలామహాగ్రహాలు
ఆరు రుతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు
18. మంత్రిణిదండిని శక్తిసేనలు కాళీకారాలిసేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు
19. సువర్ణరంజిత సుందరగిరులు అనంతాదేవి పరిచారికలు
గోమేధికమని నిర్మితగుహలు మణిద్వీపానికి మహానిధులు
20. సప్తసముద్రములనంతనిధులు యక్షకిన్నరకిమ్పురాశుదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు
21. మానవమాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు
22. భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యము
23. కోటిప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు 
పదారురేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు
24. దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు 
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు
25. శ్రీవిఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు 
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు
26. పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు 
సంతానవృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు
27. చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు 
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు
28. దుఃఖము తెలియని దేవిసేనలు నటనాట్యాలూ సంగీతాలు 
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు
29. భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యము
30. పదునాల్గులోకాలన్నిటిపైనా సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వతస్థానం
చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో
మణిగణఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో
పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
నూతనగృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు
చదివినచాలు అంత శుభమే అష్టసంపదల తులతూగేరు
నూతనగృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు
చదివినచాలు అంత శుభమే అష్టసంపదల తులతూగేరు
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివినచోట
తిష్ట వేసుకుని కూర్చొనునంటా కోటిశుభాలను సమకూర్చుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యము
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యము
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యము




Manidweepa varnana - Bhakti geethal

Comments

Post a Comment